'రేపు మండపేటలో పీజిఆర్ఎస్ కార్యక్రమం'
కోనసీమ: మండపేట పురపాలక సంఘం కార్యాలయంలో సోమవారం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం వేదిక నిర్వహిస్తున్నట్లు పుర పాలక సంఘం కమీషనర్ టీవీ రంగారావు తెలిపారు. ఉదయం పది గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మండపేట టౌన్, మండల పరిధిలో గల ప్రజలు ఈ గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.