హఫీజ్‌పేట్‌లో ఘనంగా పవర్ లిఫ్టింగ్ పోటీలు
RR: హఫీజ్‌పేట్‌లో బోయిని అనూష మహేష్ యాదవ్ సహకారంతో WRPF ఆధ్వర్యంలో నిర్వహించిన పవర్ లిఫ్టింగ్ పోటీలు విజయవంతమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మియాపూర్ సీఐ శివప్రసాద్ విజేతలకు బహుమతులు అందజేసి, క్రీడలు క్రమశిక్షణ, శారీరక దృఢత్వానికి ఎంతో అవసరమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.