నేడు ఒంగోలుకు రానున్న మంత్రి సత్య కుమార్
ప్రకాశం: నేడు ఒంగోలు నగరానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ రానున్నారు. ఒంగోలులో ఇవాళ మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నట్లు ఒంగోలు బీజేపీ నాయకులు తెలిపారు. సాయంత్రం జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పాల్గొననున్నారు.