జానకీపురం ఎన్కౌంటర్కు నేటితో 11 ఏళ్లు
NLG: మోత్కూరు(M) జానకీపురం శివారులో జరిగిన ఎన్కౌంటర్కు నేటితో 11 ఏళ్లు పూర్తయ్యాయి. 2015 ఏప్రిల్ 4న సిమీ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆత్మకూరు SI సిద్ధయ్య, కానిస్టేబుల్ నాగరాజు వీరమరణం పొందారు. వెంటనే అప్రమత్తమైన రామన్నపేట CI బాలగంగిరెడ్డి, సిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో ఉగ్రవాదులు అస్లాం, జాకీర్ అక్కడికక్కడే హతమయ్యారు.