VIDEO: శ్రీవారి సేవలో ముఖేష్ అంబానీ
TPT: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ సంస్థ అధ్యక్షుడు ముఖేష్ అంబానీ సన్నిహితులతో కలిసి ఆదివారం వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా వైకుంఠం వద్ద ఆయనకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ రంగనాయక మండపంలో స్వామివారి పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.