‘శర్వానంద్‌తో కెమిస్ట్రీ అదిరింది’

‘శర్వానంద్‌తో కెమిస్ట్రీ అదిరింది’

'బైకర్' హీరో శర్వానంద్‌తో తన కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని హీరోయిన్ మాళవిక నాయర్ చెప్పింది. సెట్‌లో శర్వా టైమింగ్ అద్భుతమని, తమ ఇద్దరి వ్యక్తిత్వాలు ఒకేలా ఉంటాయని ఆమె పేర్కొంది. సీనియర్ హీరో రాజశేఖర్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభవమని కొనియాడింది. తండ్రీ తనయుల మధ్య సాగే ఎమోషన్ ఈ సినిమాకు హైలైట్ కానుందని మాళవిక వెల్లడించింది.