VIDEO: ఆర్టీసీ డ్రైవర్ మృతి.. సీసీ కెమెరాల దృశ్యాలు
MHBD: తొర్రూరు పట్టణానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ షేక్ యాకూబ్ పాషా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం విధులు ముగించుకుని డీపో నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో స్కూటీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీ టీవీ ఫూటేజ్ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు.