తొలిసారిగా హెయిర్ డై చేస్తున్నారా?

తొలిసారిగా హెయిర్ డై చేస్తున్నారా?

తెల్ల జుట్టు లేదా ఫ్యాషన్ కోసం కొందరు హెయిర్ డై వాడుతుంటారు. అయితే తొలిసారిగా హెయిర్ డై చేసుకుంటున్నవారు ముందుగా కొన్ని అలర్జీ టెస్టులు చేసుకోవాలి. ఇందుకోసం చెవి వెనక కాస్త డై రాయాలి. ఎలాంటి రియాక్షన్ లేకపోతే దాన్ని వాడుకోవచ్చు. ఇంట్లోనే డై చేయాలనుకుంటే ముందుగా పార్లర్‌లో ప్రొఫెషనల్స్‌తో చేయించుకోవడం మంచిది. వారు ఎలా వేస్తున్నారో గమనించి ఫాలో అవ్వండి.