కాలం ముందే వచ్చి కన్నీరే మిగిల్చింది!

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో పత్తి, మొక్కజొన్న రైతన్నలు విత్తనాలు విత్తుకుంటుంటే, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు పోసిన రైతులు మాత్రం కన్నీరు పెట్టుకుంటున్నారు. ధాన్యం తడిసి మొలకెత్తుతుండటం, వరదలో ధాన్యం కొట్టుకుపోతుండటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు ఓవైపు హర్షిస్తూనే, మరోవైపు కన్నీరుమున్నీరవుతున్నారు.