చిన్నారికి ఆర్థిక సహాయం అందించిన సింహ వాహిని ఫౌండేషన్

చిన్నారికి ఆర్థిక సహాయం అందించిన సింహ వాహిని ఫౌండేషన్

SRD: శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న పటన్‌చెరుకు చెందిన రెండు నెలల శిశువుకు రూ. 11,200 ఆర్థిక సహాయం అందజేసినట్లు సింహ వాహిని ఫౌండేషన్ ప్రకటించింది. రోజు కూలీగా పనిచేస్తున్న చిన్నారి తండ్రి ఫౌండేషన్‌ను ఆశ్రయించగా, సంస్థ అధ్యక్షుడు వంశీ రెడ్డి సభ్యులతో కలిసి కుటుంబాన్ని కలిసి ఈ ఆర్థిక సహాయం అందించారు. ఈ సాయం అందించిన ప్రతి దాతకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.