'తిరునాళ్లకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు'

'తిరునాళ్లకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు'

BPT: నిజాంపట్నం మొగదారమ్మ తల్లి శిడిమాను ఉత్సవాల నేపథ్యంలో రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో దేవస్థాన కమిటీ, గ్రామ పెద్దలతో భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. ఉత్సవాలు మే 8 నుంచి 12 వరకు జరుగనున్న నేపథ్యంలో గజ్జలు, కర్రలు, ఆయుధాలు తీసుకురావడం నిషిద్ధమని, ఉల్లంఘించినవారిపై చర్యలు తప్పవన్నారు.