'నేషనల్ హెరాల్డ్ కేసు కొట్టివేత.. బీజేపీకి చావుదెబ్బ'

'నేషనల్ హెరాల్డ్ కేసు కొట్టివేత.. బీజేపీకి చావుదెబ్బ'

WGL: నేషనల్ హెరాల్డ్ (యంగ్ ఇండియన్) కేసును కోర్టు కొట్టివేయడం బీజేపీ ప్రభుత్వానికి చావుదెబ్బ అని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం అన్నారు. మంగళవారం వర్ధన్నపేట పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ దర్యాప్తు చట్ట విరుద్ధమని కోర్టు తేల్చిందన్నారు. ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసేనని విమర్శించారు. ధర్మమే గెలిచిందని, అధర్మం ఓడిపోయిందని తెలిపారు.