'అనుమతులు లేకుండా అమ్మితే చర్యలు తప్పవు'
NLR: మర్రిపాడు మండల పరిధిలో అనుమతులు లేకుండా యూరియా, ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ శాఖ అధికారి కవిత హెచ్చరించారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలుంటాయని, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.