జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నాగసాధువుల ప్రచారం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నాగసాధువుల ప్రచారం

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 'యుగతులసి పార్టీ' అభ్యర్థికి మద్దతుగా నాగసాధువులు ప్రచారం చేస్తున్నారు. కొలిశెట్టి శివకుమార్‌కు మద్దతుగా వారణాసి నుంచి వచ్చిన 11 మంది నాగసాధువులు ప్రచారం నిర్వహించారు. సోమాజిగూడ, బోరబండ ప్రాంతాల్లో ఓట్లు అభ్యర్థించారు. గోవధ నిషేధం, గోవును జాతీయ మాతగా గుర్తించాలనే లక్ష్యంతో తమ పార్టీ కృషి చేస్తుందని శివకుమార్ తెలిపారు.