బంజారా సమ్మేళనంలో ఎంపీ కడియం కావ్య

బంజారా సమ్మేళనంలో ఎంపీ కడియం కావ్య

హనుమకొండలోని శ్రీహర్ష కన్వెన్షన్ హాల్‌లో నేడు జరిగిన బంజారా ఆత్మీయ సమ్మేళనానికి ఎంపీ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరై బంజారా గోత్ర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఎంపీ కడియం మాట్లాడుతూ.. బంజారా సమాజం విద్య, ఉపాధి, ఆరోగ్యం రంగాల్లో అభివృద్ధి సాధించాలని, యువతకు సంస్కృతి, చరిత్రపై అవగాహన పెరుగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సామాజిక ప్రతినిధులు పాల్గొన్నారు.