ఉప్పల్‌లో ముగ్గుల పోటీలు

మేడ్చల్: ఉప్పల్ నియోజకవర్గ ఉప్పల్ భాగాయత్ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలను మేకల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, ఉప్పల్ ట్రాఫిక్ సీఐ లక్ష్మీ మాధవి పాల్గొని ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.