పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గండ్ర
BHPL: బాగిర్తిపేట క్రాస్ నుంచి బుద్ధారం వరకు నిర్మాణంలో ఉన్న రోడ్డు పనులను నేడు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులను సకాలంలో పూర్తిచేసేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి వారిని ఎమ్మెల్యే దర్శించుకుని పూజలు నిర్వహించారు.