VIDEO: రోడ్లపై సంచరిస్తున్న వానర సైన్యం
SRPT: నడిగూడెం మండలం రామాపురం నుంచి చాకిరాల వెళ్లే ప్రధాన రహదారిపై వానర సైన్యం వాహనదారులను హడలెత్తిస్తోంది. ఆహారం కోసం కోతుల గుంపులు రోడ్లపైకి వస్తుండటంతో ప్రయాణికులు, వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడవులు అంతరించిపోవడంతో కోతులు గ్రామాలపై పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.