పెద్దమ్మ ఆలయంలో చోరీ

పెద్దమ్మ ఆలయంలో చోరీ

SRCL: కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామంలోని పెద్దమ్మ ఆలయంలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు చోరికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆలయంలోని రెండు బంగారు పుస్తెలు, బంగారు ముక్కు పోగు, 4 వెండి మట్టెలు అపహరించారు. గుడిలో పని చేసే లక్ష్మీరాజం సాయంత్రం వెళ్ళి చూసేసరికి గుడికి వేసిన తాళం పగలగొట్టి ఉంది. సంఘం నాయకుడు బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.