'మా గ్రామాలకు బస్సు నడపాలంటూ వినతి'
W.G: ఆకివీడు మండలం పెదకాపవరం నుంచి భీమవరం, ఉండి మీదుగా నడిచే ఆర్టీసీ బస్సు సర్వీసు నిలిచిపోవడంతో విద్యార్థులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఉదయం, సాయంత్రం వేళల్లో సౌకర్యంగా ఉన్న ఈ సర్వీస్ లేక, విద్యార్థుల తల్లిదండ్రులు 5 కి.మీ. దూరంలో ఉన్న పాములపర్రుకు వెళ్లి బస్సు ఎక్కించాల్సి వస్తోంది. సర్వీసు తిరిగి ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.