ఈ నెల 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

కాకినాడ : ఈ నెల 25వ తేదీ నుంచి వారం రోజుల పాటు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు ఆర్డీఓ శ్రీ రమణి తెలిపారు. పెద్దాపురంలో 39,286 రేషన్ కార్డులు స్మార్ట్ కార్డులుగా మారనున్నాయన్నారు. క్యూ ఆర్ కోడ్ ఉండే విధంగా కార్డులు రూపకల్పన జరిగిందని తెలిపారు. ఈ కార్డు ద్వారా ఎక్కడి నుంచైనా లబ్ధిదారులు రేషన్ పొందవచ్చని సూచించారు.