రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
TG: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఏనుగుల శివ, లోకేష్‌గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.