VIDEO: ప్లేస్‌మెంట్ పేరుతో మోసం.. కాలేజీపై ఆగ్రహం
VSP: ప్లేస్‌మెంట్ల పేరుతో ఓ డిగ్రీ కాలేజీ విద్యార్థులను మోసం చేస్తోందని ఏఐఎస్ఎఫ్ నేతలు ఆరోపించారు. విశాఖలో శనివారం నాయకులంతా మీడియాతో మాట్లాడారు. భారీ ఫీజులు వసూలు చేసి ఉద్యోగాలు కల్పించడంలో విఫలమవుతున్నారని మండిపడ్డారు. సంబంధిత అధికారులు వెంటనే విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని, లేకపోతే ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు.