VIDEO: పిల్లలతో ఆటలాడిన కలెక్టర్
NLR: ఆత్మకూరు మండలం చిరువెళ్లకు వచ్చిన కలెక్టర్ హిమాన్షు శుక్లా అంగన్వాడీ కేంద్రంలో కొద్దిసేపు చిన్నపిల్లవాడిగా మారిపోయారు. అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులతో కలిసి నేలపై కూర్చొని ఆట వస్తువులతో ఆడుకుంటూ వారితో మాటలు కలిపారు. దాదాపు అరగంట పైగా వారితో సరదాగా గడపడం విశేషంగా నిలిచింది. అనంతరం చిన్నారులను ప్రశ్నలు అడిగి సమాధానాలను రాబట్టారు.