చికిత్స పొందుతూ బాలుడు మృతి

చికిత్స పొందుతూ బాలుడు మృతి

VSP: పాత గాజువాక డ్రైవర్స్ కాలనీలో మేడ మీద గాలిపటం ఎగురువేస్తూ ఓ బాలుడు విద్యుత్ షాక్కు గురైన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఆకాష్ (09)ని తల్లిదండ్రులు కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.