నిజాంసాగర్ కాలువ ద్వారా 1,300 క్యూసెక్కుల నీటి విడుదల

నిజాంసాగర్ కాలువ ద్వారా 1,300 క్యూసెక్కుల నీటి విడుదల

KMR: పంట సాగుకు ఊరటగా నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా మంగళవారం 5వ విడతలో 1,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈఈ అక్షయ్ కుమార్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.742 టీఎంసీల నీరు నిల్వలో ఉందన్నారు. విడుదలైన నీటిని రైతులు పొదుపుగా వినియోగించి సాగుకు ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.