VIDEO: కారును ఢీకొన్న విమానం

VIDEO: కారును ఢీకొన్న విమానం

రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఓ విమానం ఢీకొట్టింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఫ్లోరిడాలోని బ్రెవర్డ్ కౌంటీ వద్ద ఓ చిన్న విమానం నేలపై వాలిపోయింది. ఈ క్రమంలో ఎదురుగా ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. విమానంలో పైలట్‌తో పాటు ఓ ప్రయాణికుడు ఉన్నాడు. వీరు సురక్షితంగా బయటపడినట్లు అధికారులు వెల్లడించారు.