సామూహిక ఉపనయన మహోత్సవం

NLR: బుచ్చి పట్టణంలోని బ్రాహ్మణ వీధిలోని శంకర మఠంలో శ్రీశ్రీశ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య స్వామి జయంతి ఉత్సవములు బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి. 47వ సామూహిక ఉపనయన మహోత్సవాన్ని నిర్వహించారు. శుక్రవారం నుండి ఆదివారం వరకు శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య స్వామి వారి జయంత్యుత్సవములు నిర్వహిస్తున్నామని అర్చకులు తెలిపారు.