జిల్లాను క్షయ రహితంగా తీర్చిదిద్దాలి: డీఎంహెచ్‌వో
NLG: ప్రపంచ క్షయ దినం సందర్భంగా చందంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 'టీబీ ముక్త్ భారత్ అభియాన్' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో డా. పుట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లాను క్షయ రహితంగా తీర్చిదిద్దడానికి ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. వ్యాది లక్షణాలు ఉంటే వెంటనే సంబంధిత ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.