భారీగా పట్టుబడిన సబ్సిడీ బియ్యం
NTR: వట్టి చెరుకూరు మండలంలో ఇవాళ సివిల్ సప్లై అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. దాడుల్లో భాగంగా అనంతవరప్పాడులోని ఓ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వచేసిన 87.50 క్వింటాళ్ల ప్రభుత్వ సబ్సిడీ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మిల్ యజమానిపై స్థానిక PSలో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కాగా, గతంలోనూ ఈ మిల్‌లో సబ్సిడీ బియ్యం పట్టుబడినట్లు తెలిపారు.