VIDEO: జీర్గి తండాలో నీటి సమస్య.. ప్రజల కష్టాలు
SRD: కంగ్టి మండలం జీర్గి తాండలో నీటి సమస్య నెలకొంది. ప్రజలు స్థానిక శివారులోని వ్యవసాయ బోరు వద్దకు వెళ్లి బిందెలతో తాగునీరు తెచ్చుకుంటున్నారు. గ్రామానికి మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్, పైప్లైన్ ఉన్నప్పటికీ నీటి సరఫరా కావడం లేదని స్థానికులు శనివారం తెలిపారు. అధికారులు స్పందించి నీటి సమస్య తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.