'వయో వృద్ధులకు రూ. 5 లక్షలు ఆరోగ్య బీమా'

కృష్ణా: రాష్ట్రంలోని వయో వృద్ధులకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా ఆరోగ్య సంరక్షణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని, ఇందులో భాగంగా 3,257 రకాల శస్త్ర చికిత్సలు చేయించుకోవచ్చని టీడీపీ నేత బెజవాడ నజీర్ తెలిపారు. శుక్రవారం పటమటలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పీఎంజేఏవై కింద రూ. 5 లక్షల ఆరోగ్య బీమాను అందుకోవచ్చన్నారు.