ఏడుపాయల వన దుర్గ మాతకు ప్రత్యేక పూజలు

MDK: పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో శనివారం అమ్మవారికి స్థిర వాసరే ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేసి సుగంధ పుష్పాల పరిమళాలతో అలంకరించి మహా మంగళ హారతి నీరాజనం చేశారు. అనంతరం అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు.