కాలినడకన భద్రగిరికి భక్తుల ప్రయాణం

కాలినడకన భద్రగిరికి భక్తుల ప్రయాణం

ఖమ్మం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఏప్రిల్ 17న జరగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవానికి గోటితో వలచిన తలంబ్రాలను సమర్పించడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని శ్రీ సీతారామ లక్ష్మణ భక్తాంజనేయ స్వామి ఆలయం తరపున రామభక్తులు చర్ల నుండి భద్రాచలానికి ఆదివారం కాలినడకన బయలుదేరారు. చర్ల నుండి 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాచలానికి కాలిడకన వెళ్లారు.