లారీ ఓనర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే

గద్వాల లారీ ఓనర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పచ్చర్ల శ్రీధర్ గౌడ్, నూతన కార్యవర్గం ఎమ్మెల్యే సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి ఎమ్మెల్యేను సన్మానించారు. అనంతరం అధ్యక్షుడుకి కార్యవర్గం శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు.