'కిరీటం గెలుచుకోవటం దేశానికే గర్వకారణం'

'కిరీటం గెలుచుకోవటం దేశానికే గర్వకారణం'

E.G: రాజమండ్రికి చెందిన సుష్మిత సోమిరెడ్డి "Mrs. న్యూయార్క్" కిరీటం గెలుచుకోవటం దేశానికే గర్వకారణమని మాజీ ఎంపీ హర్ష కుమార్ గురువారం ప్రశంసించారు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు మహిళగా ఆమె చరిత్ర సృష్టించారని కొనియాడారు. ఆమె ఆత్మవిశ్వాసం, కృషి మహిళా సాధికారతకు నిదర్శనమని, సమాజానికి స్ఫూర్తినిచ్చే వ్యక్తిగా ఆదర్శంగా నిలిచారన్నారు.