తునిలో భవన నిర్మాణ కార్మికుల భారీ ర్యాలీ

KKD: తునిలో భవన నిర్మాణ కార్మికులు శనివారం నిరసన ర్యాలీ చేపట్టారు. భవన నిర్మాణ కార్మికుల పథకాలను కేంద్రం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తుని పట్టణంలోని ఎల్ఐసి బిల్డింగ్ నుంచి గొల్ల అప్పారావు సెంటర్ వరకు భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. కేంద్ర బడ్జెట్లో తమకు నిధులు కేటాయించాలని యూనియన్ నాయకుడు మజూరి నారాయణరావు డిమాండ్ చేశారు.