సీసీ కెమెరాలను ప్రారంభించిన ఈస్ట్ జోన్ డీసీపీ
WGL: ఆత్మకూరు మండలం కామారం గ్రామానికి చెందిన మూల మధుకర్ (రుద్ర ఓవర్సిస్) సాకారంతో ఏర్పాటు చేసిన 20 సీసీ కెమెరాలను సోమవారం ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. సీసీ కెమెరాలతో గ్రామాల్లో నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ సతీష్ బాబు, సీఐ సంతోష్ తదితరులు ఉన్నారు.