రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
CTR: వంతెనపై పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన శ్రీరంగరాజపురం మండలంలో నిన్న రాత్రి జరిగింది. పొదల పల్లెకు చెందిన బాబు బైక్‌పై వెళ్తుండగా ఉడమాలకుర్తి గ్రామం వద్ద వంతెనపై అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై ఉన్న మరో ఇద్దరికీ గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.