రెండు బైకులు ఢీ.. ఇద్దరికీ తీవ్ర గాయాలు

రెండు బైకులు ఢీ.. ఇద్దరికీ తీవ్ర గాయాలు

MHBD: కురవి(M)పెద్ద తండా స్టేజి సమీపంలో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. బయ్యారం నుంచి MHBDకు బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి బస్సును ఓవర్టేక్ చేయబోయి.. ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.