రేపు పంచాయతీ భవనం ప్రారంభం

KNR: శంకరపట్నం మండలం గొల్లపల్లిలో బుధవారం నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని రేపు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరుకానున్నట్లు కాంగ్రెస్ మండలాధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్ తెలిపారు. అనంతరం కేశవపట్నం రైతు వేదికలో CMRF లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేస్తారని పేర్కొన్నారు.