గుంతకల్లులో నంచర్ల యువకుడి దారుణ హత్య

గుంతకల్లులో నంచర్ల యువకుడి దారుణ హత్య

KRNL: చిప్పగిరి(M) నంచర్లకు చెందిన యువకుడు చంద్రశేఖర్ అనంత(D) గుంతకల్లులో దారుణ హత్యకు గురయ్యాడు. ఈయన గుంతకల్లులోని ఆదర్శ నగర్‌లో ఉంటున్నాడు. శుక్రవారం కుళాయి వద్ద నీటి కోసం చంద్రశేఖర్, పక్కింటి శివకు మాటమాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో చంద్రశేఖర్‌ను శివ కొడవలితో నరికి చంపాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.