ప్రకాశంలో 2, 82,303 మందికి పెన్షన్ మంజూరు

ప్రకాశం: జిల్లాలో మే నెలకు సంబంధించి 2, 82, 303 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మంజూరయ్యాయి. రూ.123.22 కోట్లను గ్రామ, వార్డు సచివాలయాల ఖాతాలకు జమ చేశారు. బుధవారం నగదు విత్ర చేశారని, మే డే అయినప్పటికీ గురువారం ఉదయం నుంచి లబ్దిదారులకు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.