SSC పరీక్షలకు సరైన ఏర్పాట్లు: DEO
WNP: పదో తరగతి పరీక్షల సమయంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘనీ తెలిపారు. మార్చి 14న పరీక్షలు ప్రారంభమవుతాయి. జిల్లా వ్యాప్తంగా 37 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. మొత్తం 7,212 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షలు - 3,577 మంది బాలురు, 3,635 బాలికలు అని తెలిపారు.