సమగ్ర విచారణకు మహిళా కమిషన్ ఆదేశం
KNR: గంగాధర మండలంలోని కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులపై అటెండర్ చేసిన అనుచిత ప్రవర్తను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద తీవ్రంగా ఖండించారు. విద్యాసంస్థల్లో చదువుకునే బాలికల భద్రత, గౌరవం పట్ల నిర్లక్ష్యాన్ని, ఏ రూపంలోనూ సహించబోమని స్పష్టం చేశారు. విషయంపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.