'రైతులకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి'

'రైతులకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి'

SRPT: రాబోయే వానాకాలం సీజన్‌లో రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, కోదాడ మార్కెట్ కమిటీ ఛై‌ర్‌పర్సన్ తిరుపతమ్మ అధికారులను ఆదేశించారు. గురువారం జరిగిన నడిగూడెం కోపరేటివ్ బ్యాంక్ సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సొసైటీల ద్వారా యూరియా, జింక్, ఇతర వ్యవసాయ పనిముట్లు రైతులకు సకాలంలో అందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.