తిరుమలకు భారీగా భక్తుల తాకిడి
TPT: తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. సోమవారం ఉదయం క్రిష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ భక్తులు క్యూ లైన్‌లో శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. స్లాటెడ్ సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పట్టగా, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 3-4 గంటలు పట్టవచ్చని టీటీడీ తెలిపింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారిదర్శనానికి 18 గంటల సమయం పట్టవచ్చని పేర్కొంది.