శ్రీకాకుళంలో జీడి బోర్డు ఏర్పాటుకు మంత్రి లోకేష్ కృషి!

శ్రీకాకుళంలో జీడి బోర్డు ఏర్పాటుకు మంత్రి లోకేష్ కృషి!

SKLM: జిల్లాలో జీడి బోర్డు ఏర్పాటు చేసేందుకు మంత్రి నారా లోకేష్ అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు ఆయన కేంద్రవాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్‌ను న్యూఢిల్లీలో కలిసి శ్రీకాకుళంలో జీడి బోర్డు మంజూరు చేయాలని కోరినట్లు వెల్లడించారు. జీడిపప్పు ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం రెండో స్థానంలో ఉందని, పలాస జీడిపప్పు తిరుపతి దేవస్థానానికి ఎగుమతి అవుతుందన్నారు.