ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు కేంద్రం సన్నాహాలు
ఢిల్లీలో ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వానికి ఫిల్మ్‌సిటీ కోసం 486 ఎకరాల భూమిని కేంద్రం ఇవ్వనుంది. ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం మధ్య ఈ ఒప్పందం కుదరనుంది. ఇందులో అత్యాధునిక షూటింగ్ స్టూడియోలు, డిజిటల్ ఎడిటింగ్ సూట్లు, ఇతర సినీ సాంకేతిక సదుపాయాలు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.