FLASH: కల్వర్టుపై నుంచి ప్రమాదకరంగా వాహనాలు..!

మేడ్చల్: ఉప్పల్ కావేరి నగర్ కల్వర్టు నిర్మాణం ఇటీవల పూర్తయింది. క్యూరింగ్ జరగకముందే వాహనదారులలు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో కల్వర్టుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఆటో, వివిధ ట్యాక్సీలు సైతం ప్రమాదకరంగా కల్వర్టుపై నుంచి వెళుతున్నాయని, కల్వర్టుకు ప్రమాదం పొంచి ఉందని, వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.